ప్రాణం బరువెంత..?
ఫిజికల్లీ 21 గ్రామ్స్
మరి మానసికంగా..?
ప్రేమ బరువెంత...
పాపం బరువెంత...
పగిలిన బతుకుల బరువెంత?
ఆశ, పాశం, పాపం
ప్రాణం ఒక తీర్చలేని రుణం
పాపం ఒక మోయలేని భారం
పీల్చేగాలి విషం అనిపించేంత
ప్రియమైన వారి ముందూ ఉండలేనంత
ప్రాణమే పోతున్నంత
గుండె గాయాన్ని ఎవరైనా
చనుమొనలతో నిమరాలి
నా లోపలి హమ్మింగ్‌బర్డ్ ఎగిరి పోయేదాకా..!

No comments:
Post a Comment