ప్రపంచంలో క్యాపిటలిజం తప్ప మరో మతం లేదు. పాత మతాల్లో దేవుళ్లు, దెయ్యాల గోల ఉంటుంది. కానీ దెయ్యాలు మాత్రమే ఉండే మతం ఇది. అనుసరించడం మనకు అనివార్యం. అసలు నీ అనుమతి ఎవడిక్కావాలి. నువ్వు పుట్టకముందే నువ్వు క్యాపిటలిస్టువి. నేనూ అంతే.
యుద్ధాన్ని అదే పుట్టిస్తుంది. శాంతి కోసం అదే ఏడుస్తుంది. కుట్ర ఎవరైనా చేయొచ్చు. యుద్ధం అది చెప్పినవాళ్లతోనే చేయాలి. వార్కి ఒక మార్కెట్. శాంతికి మరో మార్కెట్. రెండు చోట్లా లాభపడేది మాత్రం బిగ్ ప్లేయర్లే. మనుషులు ఇక్కడ మార్కెట్ ముడిసరుకులు. బిగ్ ప్లేయర్స్ విల్ ప్లే విత్ దెమ్ అకార్డింగ్ దెయిర్ ఇంటరెస్ట్. పంచభూతాలే అంగడి సరుకులుగా మారిపోయాయి. నువ్వెంత..! నువ్వు ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, ఏ భాష మాట్లాడాలి, ఎవరిని పూజించాలి, ఎవరితో కలిసి బతకాలి, ఎంతమందిని కనాలి, ఏ పని చేయాలి, ఎవర్ని ద్వేషించాలి, ఎప్పుడు చావాలి..? ఇట్ డిసైడ్స్ ఎవ్రీథింగ్. నాకు నచ్చినట్టు బతుకుతున్నా అని సోకులు చెప్పుకోవద్దు. యు డోన్ట్ హేవ్ ఎనీ ఎగ్జంప్షన్స్.
భిన్నత్వంలో మనుషులకి ఇష్టాఇష్టాలు ఉంటాయి. ఏకత్వంలో మార్కెట్ చెప్పిందే శాసనం. మనుషులంతా హెర్డ్ థియరీ పాటిస్తేనే దానికి లాభం. సమూహాలన్నీ ఒకే దేవుడ్ని పూజిస్తే లాభం. సామ్రాజ్యవాదం పునాదిగా ఎదిగిన మతాలనే చూడండి. ఒకే దేవుడు ఉంటాడు. మిగిలిన చిన్నా చితకా మతాలు కూడా ఇప్పుడు పాటిస్తున్నది అదే. ఈ మతాలన్నీ తమ అసలు ఆకారాన్ని ఎప్పుడో కోల్పోయాయి. క్యాపిటలిజం అవసరాల మేరకు మాత్రమే ఉనికిలో ఉన్నాయి. ప్రపంచం ఏకత్వం వైపు ఎప్పటినుంచో నడుస్తోంది. నడిపించబడుతోంది. మన తరమో, మరో తరమో... ఇట్స్ ఇనెవిటబుల్.