Wednesday, September 6, 2017

ఓల్డ్ బాయ్‌

నా జీవితం ఇలా సంక‌నాకి పోవ‌డానికి ఒక‌డు కార‌ణం. వాడు దొర‌కాలి. నాలో నేను కార్చుకున్న ర‌క్తానంతా.. వాడి నుంచి పీల్చుకుంటా. నా గుండెకి అయిన గాయాల‌కి వాడి చ‌ర్మంతో క‌ట్టు క‌ట్టేస్తా. క‌చ్చితంగా దొరుకుతాడు వాడు. కానీ వాడెవ‌డో తెలుసా..? 

నేనే..

నా సినిమాలో నేనే హీరో.. నాకు నేనే విల‌న్‌. 
ఎలా చంపాలి వీడ్ని..? ఎలా నా బాధ‌ని తీర్చుకోవాలి..?

ఈ సినిమా చూశాన‌ని చెప్ప‌గానే.. విహారి ఏమ‌న్నాడంటే.. ఎందుకు చూశావా సినిమాని..? 
వానెమ్మ.. ఏం కాన్సెప్ట్ అది. ఛీ.

నిజ‌మే కాస్త డైజ‌స్ట్ చేసుకోలేని కాన్సెప్టే. కానీ అది ఎంచుకోడానికి వాడెంత ధైర్యం చేసి ఉండాలి. ఒక సినిమాలో హీరో, విల‌న్ ఒక‌డ్నే చూపించడానికి ఎన్ని గుండెలుండాలి..? ద‌ట్స్ వై ఐ ల‌వ్ దిస్ మూవీ. 

గ్రీకు పురాణాల్లోని ఈడిప‌స్ పాత్ర‌ ఇన్‌స్పిరేష‌న్‌తోనే ఈ మూవీ తీశానంటాడు డైరెక్ట‌ర్ చాన్‌-వూ. హీరో పేరు ఈడిప‌స్‌ను గుర్తు తెచ్చేలా డే సు అని పెట్టాడ‌ట‌. అయితే ప్ర‌ధాన పాత్ర‌లు రెండూ ఈడిప‌స్‌ ప్ర‌తిరూపాల్లానే ఉంటాయి. 

ఈ సినిమా చాన్నాళ్ల నుంచి చూడాల‌ని, ధైర్యం చాల‌క చూడలేదు. సినిమా గురించి యూట్యూబ్‌లో చూస్తే ఎప్పుడూ ఒక ఫైట్ సీన్ క‌నిపించేంది. వార్నీ ఇదేదో చైనీస్ టైప్.. ఫైటింగ్ బాప‌త‌ని వ‌దిలేశా. కానీ ఎందుకో ధైర్యం చేసి చూశా. వాటే స్క్రీన్‌ప్లే..వాటే స్క్రీన్ ప్లే. 

సినిమా చూడ‌డానికి ముందు నేను చూసిన కారిడార్ ఫైట్ సింగిల్ టేక్‌లో తీశారంట‌. మూడు రోజులు 17 టేక్‌లు తీస్తే.. ఫైన‌ల్‌గా ఒక టేక్‌ను తీసుకున్నారు. ఒక్క ముక్క కూడా ఎడిట్ చేయ‌లేదు. కేవలం హీరో వీపుపై దిగే క‌త్తి కోసం మాత్రమే గ్రాఫిక్ వ‌ర్క్ చేశారు. 

ఈడిప‌స్ క‌థ తెలిసుంటే సినిమాలో కంటెంట్ కూడా ఏమాత్రం ఇబ్బంది పెట్ట‌దు. మ‌స్ట్ వాచ‌బుల్ మూవీ(మై ఫీలింగ్‌).

2 comments:

  1. Hero and villain are same? How could we understand? Maybe its difficult to understand without knowing about edipus story.

    ReplyDelete
    Replies
    1. తను పెళ్లిచేసుకున్న‌ది త‌ల్లినే అని తెలిసి బాధ‌ప‌డే క‌థ ఈడిప‌స్‌ది. ఇక్క‌డ ఈడిప‌స్ ఇన్‌స్పిరేష‌న్‌తో ప‌ధాన పాత్ర‌ని మాత్ర‌మే సృష్టించుకున్నాడు డైరెక్ట‌ర్‌. మిగ‌తా కథంతా వేరు.

      ప్ర‌ధాన పాత్ర‌లు రెండూ ఈడిప‌స్ ప్ర‌తిరూపాల్లా ఎందుకు అనిపిస్తాయంటే..
      తెలిసీ తెలియ‌ని వ‌య‌సులో సొంత చెల్లెల్ని ప్రేమిస్తాడు లీ. ఇటు సొంత‌కూతురి ప్రేమ‌లో చిక్కుకుంటాడు ప్ర‌ధాన పాత్ర డే-సు.

      మిగిలిన సినిమాకి వ‌స్తే.. మ‌నం రోజంతా బోల్డంత చెత్త వాగేస్తాం. దాని వ‌ల్ల ఎవ‌రివో జీవితాలు క‌ష్టాల్లోకి వెళ్లిపోతుంటాయ‌ని చెప్పే ప్ర‌య‌త్నం క‌నిపిస్తుంది. సినిమాలో గొప్ప‌ద‌నం అంతా స్క్రీన్‌ప్లేది. హీరో పాత్ర త‌న‌ని 15 ఏళ్ల‌పాటు బందీని చేసినవాడ్ని వెతికిప‌ట్టుకుని చంపాల‌నుకుంటాడు. కానీ ఆ వెతుకులాట‌లో తెలిసేదేంటంటే.. త‌న జీవితం స‌మాధి కావ‌డానికి పునాది వేసుకున్న‌ది త‌నే అని. త‌న క‌థ‌లో త‌నే హీరో, త‌నే విల‌న్ అయిపోతాడు. ఇదీ ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ‌. సినిమా అర్ధం కావ‌డానికి ఈడిప‌స్ క‌థ తెలియాల్సిన అవ‌స‌రం లేదనే అనుకుంటున్నా. ద‌ర్శ‌కుడి థాట్ ప్రాసెస్ గురించి తెలుసుకోవ‌డానికి మాత్ర‌మే అది ఉప‌యోగ‌ప‌డుతుంది.

      Delete