కొన్నిసార్లు అవి కలలు
కొన్నిసార్లు అబద్దాలు
తీరని కలలు
అబద్దాలై ఆవిరైపోతాయి
కానీ కల అబద్ధం కాదు
నిజం కాకపోవచ్చు అంతే...
ఆకలి అందర్నీ తినేస్తుందేమో కానీ
ఆశల్ని కాదు
కలల డైనమోకి
కాస్తంత శక్తి ఇచ్చి చూడు
గాలి నీరవుతుంది
నేల బంగారం అవుతుంది
(వాటే మూవీ.. సినిమాలో బాగా నచ్చిన సీన్... విలియం, కుక్కతో కలిసి చిన్న గుట్ట మీదకి ఎక్కి చెట్లు కొట్టే సన్నివేశం చూస్తాడు. అదే సమయంలో మరో వైపు నుంచి మాస్క్ వేసుకున్న ఇంకో చిన్న కుర్రోడు కూడా అదే సన్నివేశం చూస్తుంటాడు. అటే చూస్తూ చూస్తూ వీళ్లిద్దరూ ఒకర్ని ఒకరు చూసుకుంటారు. ఆ సీన్ పిక్చరైజేషన్ బాగా వచ్చింది.)
No comments:
Post a Comment